ఉత్పత్తి శక్తులనూ, ఉత్పత్తి సంబంధాలనూ కలిపి నిర్మాణం లేదా సమాజ ‘ఆర్ధిక పునాది’ అని చాలామంది మార్క్సిస్టు రచయితలు వివరిస్తారు. ఇందుకు భిన్నంగా సైద్ధాంతిక, రాజకీయ, చట్టపరమైన, ఇతర రంగాలను ‘ఉపరితలానికి’ చెందినవని చెబుతారు. ఆర్ధిక పునాది, సమాజంలోని రాజకీయ న్యాయ, ఇతర సంబంధాలను నిర్ణయిస్తుందని లేదా‘నిర్మాణం’(‘పునాది’) ‘ఉపరితలాన్ని’ నిర్ణయిస్తుందని చెప్పడం ద్వారా చారిత్రక భౌతికవాద దృక్కోణాన్ని సమీక్షిస్తారు.
అయితే, కొన్ని సందర్భాలలో ఉపరితలం పునాది మీద కూడా స్పందించవచ్చని అంగీకరించబడింది. కానీ, ఆధిపత్య ప్రభావం పునాది నుంచి ఉపరితాలనికి ఉంటుంది. జాగ్రత్తగా పేర్కొన్నట్లయితే ఇవన్నీ చాలా చెల్లుబాటు అవుతుండగా, ఈ పదాలు తప్పుదారి పట్టించేవి కాబట్టి మనం వాటిని ఈ క్రింది కారణాల వలన తప్పించాము.
మొదటగా చూసుకున్నట్లైతే, జనాదరణ పొందిన పరిభాషలో ‘ఆర్ధిక’ అన్న పదానికి చాలా సంకుచిఅమైన అర్ధం ఉంది. మార్క్సియన్(మార్క్సిస్టు) పరిభాషలో ‘ఆర్ధిక పునాది’ అన్న పదం సామాజిక ఉత్పత్తి భౌతిక పరిస్థితుల సంపూర్ణతకంటే ఎక్కువకు గానీ తక్కువకు గానీ ఏమీ సూచించదు. మార్క్స్ ‘ఆర్ధిక’ అన్న పదానికి గల ప్రాముఖ్యత గురించి పూర్తిగా తెలియని ప్రజలు తరచుగా మార్క్సిజం, చారిత్రక భౌతికవాదాలను ఆర్ధిక నిర్ణయాత్మకతతో తప్పుగా గుర్తిస్తారు. రెండవది, సైద్ధాంతిక, రాజకీయ రంగాలు సరళంగానూ, యాంత్రికంగానూ ‘ఆర్థికంచే’ నిర్ణయించబడతాయని చారిత్రక భౌతికవాదం అస్సలు వాదించదు. అందుకు భిన్నంగా సైద్ధాంతిక, రాజకీయ రంగాలకు గణనీయమైన సాపేక్ష స్వాతంత్రం(‘స్వయంప్రతిపత్తి’) ఉందని ఇది స్పష్టంగా అంగీకరిస్తుంది. అంతేకాకుండా, (పైన పేర్కొన్న విస్తృత అర్ధంలో అర్ధంచేసుకని)‘ఆర్ధికవ్యవస్థ’ మాత్రమే అంతిమంగా నిర్ణయిస్తుందని వాదిస్తుంది.
చివరగా, సమాజాలలోని పరివర్తన కాలాల(ఉదాహరణకు సోషలిజానికి చైనా వారి పరివర్తన) చారిత్రక అనుభవం ఈ కాలాలలోనే కీలకమౌతాయని సూచిస్తుంది. రాజకీయ, సైద్ధాంతిక అంశాలు ఏ సందర్భంలోనైనా చారిత్రక భౌతికవాదంలోని అవసరమైన విషయం, సామాజిక ఉత్పత్తి, ఉత్పత్తి సంబంధాలను, వర్గ పోరాటాన్ని చరిత్ర ‘ఇంజను’(మోటారు) అని నొక్కి చెప్తుంది. ఒప్పుకున్న రేఖామాత్ర అవగాహనతో సాయుధులమై, ఇప్పుడు మనం మన దృష్టిని మార్క్సియన్ రాజకీయ ఆర్ధికవ్యవస్థ వైపు మళ్ళిద్దాము.
మార్క్సిస్టు రాజకీయ అర్ధవ్యవస్థ విధానం..
మార్క్సిస్టు ఆర్ధిక వ్యవస్థ పరిశీలనా ఉద్దేశం ‘పదార్ధ ఉత్పత్తి’, దీని అర్ధం కేవలం వస్తువుల ఉత్పత్తే కాదు, ఉత్పత్తి సంబంధాలు కూడా. ఉత్పత్తి ఎల్లప్పుడూ సామాజికంగా ఉన్నందున ఇది అలా ఉంటుంది. అందువలన పదార్ధ ఉత్పత్తి సమాజంలో, సమాజం ద్వారా జరిగేది, ఆవిధంగా సమాజ (దాని విష్టతలో) ఉత్పత్తి కూడా. ఆవిధంగా ‘అంటే అర్ధం సామాజిక అభివృద్ధి ఒక నిర్దిష్టదశలోని ఉత్పత్తి’.
ఉత్పత్తి అన్ని యుగాలూ(అభివృద్ధి వివిధ దశలలో సమాజాలు) వాస్తవానికి కొన్ని సాధారణ అంశాలను కలిగి ఉంటాయన్నది నిజం. ఏమైనప్పటికీ, మార్క్స్ నొక్కిచెప్పినవి, ఒక నిర్దిష్ట సమాజ అధ్యయనానికి కీలకమైనది, సామాజికాభివృద్ధి వివిధ స్థాయిలలో దానిని ఇతర సమాజాల నుండి వేరుగా గుర్తించే దాని సామాజిక ఉత్పత్తి లక్షణాలు అన్నది. చెప్పాలంటే, ఏదైనా నిర్దిష్ట యుగాన్ని అధ్యయనం చెయ్యడానికి ఎవరైనా ఉపయోగించే సైద్ధాంతిక విభాగాలు చారిత్రకంగా నిర్దిష్టంగా ఉండాలి.
ఒక ఉదాహరణ: మానవ చరిత్రలో చాలా వరకు ప్రజలు వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి సాధనాలను రూపొందించారు, ఉపయోగించారు. మానవుడు ఒక సాధనాన్ని తయారు చేసే జంతువు అని బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నాడు. ఆవిధంగా ఉత్పత్తి సాధనాలను వాడడం ఉత్పత్తి అన్ని యుగాలకూ సాధారణం.
ఆధునిక ఉత్పత్తిదారుడి స్వంతమైన తరిమిడిదొడ్డి(లేతు మిషన్) ఎంత ఉత్పత్తి సాధనమో, ఆటవికుడు రూపొందించిన పదునైన రాయి కూడా అంతే ఉత్పత్తి సాధనం. రెండూ తప్పనిసరిగా నిల్వ చేసిన శ్రమే. కనీ పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థ శ్రమ సాధనాన్ని మూలధనంతో సమానం చేస్తూ ఆటవికుని పదునైన రాయినీ, ఆధునిక లేతు మిషన్నూ ఒకే పద్దతిలో పరిగణించగా, లేతు మిషన్ను మూలధనంగా చేస్తున్నది ఉత్పత్తి సాధనంగా దాని లక్షణం కాదనీ, కానీ దానితో పనిచేయడానికి కూలీలను కూలికి తీసుకున్న తయారుదారుని వ్యక్తిగత ఆస్తికి గల నిర్దిష్ట సామాజిక సంబంధమని మార్క్స్ ఎత్తి చూపాడు. అప్పుడు ఉత్పత్తి సామాజిక సంబంధాల చారిత్రక విశిష్టతను మార్క్సిస్టు పద్దతి గుర్తించిందనేది మొదటి విషయం. ఒక ప్రత్యేక యుగాన్ని విశ్లేషించడానికి, అది ఆ యుగానికి చెందిన సైద్ధాంతిక విభాగాలను అభివృద్ధి చేస్తుంది. అందువలన, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ప్రాముఖ్యత వహిస్తున్న సమాజ విశ్లేషణకు సంబంధించిన మూలధనం, వేతన కార్మికుడు, అదనపు విలువ, మొదలైన విభాగాలను భూస్వామ్య లేదా బానిస ఉత్పత్తి సంబంధాలు ఆధిపత్యం వహిస్తున్న సమాజాలతో వ్యవహరించేటప్పుడు ఉపయోగించకూడదు.
ఉత్పత్తి ఎల్లప్పుడూ సామాజికంగా, చారిత్రకంగా ప్రత్యేకంగా ఉంటుందని గుర్తించిన ఎవరైనా, రాజకీయ ఆర్ధిక వ్యవస్థలో ఉత్పత్తి, వినిమయం, పంపిణీ, మారకాల మధ్య సంబంధాలను పరిగణనలోకి తీసుకోవాలి.
ఉత్పత్తి, వినియోగం, పంపిణీ..
సాంప్రదాయ అర్ధశాస్త్రం సమాజంలోని ఉత్పత్తిని వినియోగదారుని కోరిక అని పిలవబడేదానిచే నిర్ణయించబడేదిగా ఇప్పుడు చూస్తున్నది. లేదా వినియోగం చేత ఉత్పత్తి నిర్ణయించబడుతుందని భావిస్తున్నది. ఏమైనప్పటికీ, ఆ రెంటి మధ్య ఉన్న వాస్తవ సంబంధం భిన్నమైనది. వినియోగాన్ని ఉత్పత్తి అనేక విధాల ప్రభావితం చేస్తుంది, నిర్ణయిస్తుంది.
మొదట వినియోగానికి అది పదార్ధాలను అందిస్తుంది. అది వినియోగించే విధానాన్ని కూడా నిర్ణయిస్తుంది. రెండవది, సామాజిక దృష్టికోణంలో ఉత్పత్తే ‘ఉత్పత్తి సాధనాల, కార్మికుల శక్తి’ వినియోగమే. మూడవది, దాని చారిత్రక అభివృద్ధి, ఆ తరువాతి మార్పులతో ఉత్పత్తే తనకు కొత్త అవసరాలను పుట్టిస్తుంది. అంతేకాకుండా, వినియోగ కొత్త నమూనాలను నిర్ణయిస్తుంది. చాలా సరళమైన ఉదాహరణ స్వయంచాలితం(ఆటోమొబైల్).
అదేవిదంగా, ‘వినియోగం’ కూడా ‘ఉత్పత్తి’ అని చూడవచ్చు. ఒక ఉదాహరణకు కార్మికుడిని చెప్పవచ్చు. (అతని శ్రమ శక్తి పునరుత్పత్తి అతను ‘ఆహారాన్ని’ వినియోగించడం ద్వారా జరుగుతుంది. ఇంకా, వినియోగం ఉత్పత్తికి ప్రేరణ ఇస్తుంది. ఇక్కడి విషయమంతా కూడా ఉత్పత్తి, వినిమయం ఒకటే విషయం అని కాదు, కానీ అందుకు బదులుగా ‘అవి దేనిలోనైతే ఉత్పత్తి నిష్క్రమణ నిజమైన పాయింటు, ప్రధానమైన క్షణం కూడా అయిన ఒక ప్రక్రియ క్షణాలుగా కనిపిస్తాయి’. భౌతిక జీవన ఉత్పత్తి విధానానికి ప్రాముఖ్యతని యిచ్చేచారిత్రక భౌతికవాద దృక్కోణంను అనుసరించి ఇది వస్తుంది.
సామాజిక ఉత్పత్తితో, వ్యక్తికి ఉత్పత్తి- వినియోగం మధ్య సంబంధం తక్షణ అంశం కాదు. పంపిణీ, ఉత్పత్తి, వినియోగాలలో జోక్యం చేసుకుంటుంది. సాంప్రదాయ ఆర్ధశాస్త్రవేత్తలలో పంపిణీ నిర్ణాయకాలపై రెండు అభిప్రాయాలు ఉన్నాయి. దీర్ఘకాలిక అభిప్రాయం ఏమిటంటే, ఉత్పత్తి సాధారణ సహజ నియమాలచే నిర్ణయించబడుతుండగా, పంపిణీ మానవ నిర్మిత నియమాలచే నిర్ణయించబడుతున్నదని. ఉత్పత్తి సాంకేతిక పరిస్థితులు పంపిణీని నిర్ణయిస్తాయని మరొక ఇటీవలి అభిప్రాయం. ఆవిధంగా పెట్టుబదిదారీ ఆర్ధికవ్యవస్థలో భూమి, శ్రమ, మూలధనాలను ఉత్పత్తి కారకాలుగా చెబుతారు.
అంతేకాకుండా, ప్రతి ఒక్కటీ ఉత్పత్తికి దాని సహాయం మేరకు, దాని ఉత్పత్తి నుంచి ఆదాయాన్ని పొందుతుందని చెప్పబడింది. వేతనాలు, లాభాలు, అద్దె అన్నీ కూడా సంబంధిత కారకాల ఉత్పాదకత ద్వారా నిర్ణయించబడిన ‘కారకాల ఆదాయాలు’గా ఒకే స్థాయిలో ఆదరించబడ్డాయి.ఈ రెండు అభిప్రాయాలూ ప్రాథమికంగా తప్పు. ఇటీవలి దృక్కోణం, రెండవ దాని లోపాలను తరువాతి వ్యాసంలో పరిశీలిస్తాము. మొదటి అభిప్రాయానికి సంబంధించి, ఒక నిర్దిష్ట చారిత్రక యుగంలో సామాజిక ఉత్పత్తి ‘సాధారణ, సహజ నియమాల’ ద్వారా కాక నిర్దిష్ట చారిత్రక నియమాల ద్వారా నియంత్రించబడతాయని గుర్తించడం మాత్రమే అవసరం.
మార్క్సిస్టు దృష్టి కోణంలో ఉత్పత్తికీ పంపిణీకి మధ్య గల సంబంధాలను ఇప్పుడు సంక్షిప్తంగా చెప్పవచ్చు. మార్క్స్ ఎత్తి చూపినట్లు పంపిణీ అంతిమ ఉత్పత్తుల పంపిణీగా అయ్యేముందు ‘అది ఉత్పత్తి సాధనాల పంపిణీ, సమాజంలోని సభ్యులను వివిధ రకాల ఉత్పత్తుల మధ్య పంపిణీ’. ‘ఉత్పత్తుల పంపిణీ స్పష్టంగా ఏదైతే ఉత్పత్తి ప్రక్రియలోనే ఉందో, ఉత్పత్తి నిర్మాణాన్ని నిర్ణయిస్తుందో, ఆ పంపిణీ ఫలితం మాత్రమేనని కూడా అతను చేర్చాడు. ఉదాహరణకు ఎవరైనా పెట్టుబడిదారీ సమాజాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఆదాయాన్ని వేతనాలు, లాభాలుగా పంపిణీ చేయడం వేతన కార్మికుడి, పెట్టుబడిదారుడి ఉనికిని సూచిస్తుంది.
అంతేకాకుండా, ఉత్పత్తి నిర్దిష్ట సంబంధాలు దానిలో సూచించబడ్డాయి. మార్క్స్ మాటలలోని మార్క్సిస్టు దృష్టికోణాన్ని ఈ విధంగా సంక్షిప్తంగా వివరించవచ్చు: పంపిణీ నిర్మాణం పూర్తిగా ఉత్పత్తి నిర్మాణంచే నిర్ణయించబడింది. పంపిణీ తానే ఉత్పత్తికి సంబంధించిన ఉత్పత్తి, దాని వస్తువులోనే కాదు, దానిలో మాత్రమే ఉత్పత్తి ఫలితాలను పంపిణీ చేయవచ్చు. దాని రూపంలో కూడా దానిలోని ఉత్పత్తిలోని నిర్దిష్ట రకమైన భాగస్వామ్యం నిర్దిష్ట పంపిణీ రూపాలను, అంటే పంపిణీలో పాల్గొనే విధానాన్నినిర్ణయిస్తుంది.
ఉత్పత్తి- మారకం..
మారకం లేదా చలామణి(సర్క్యులేషన్) పరిధి చాలా స్పష్టంగా ఉత్పత్తిపై ఆధారపడి ఉంది. దాంట్లో(i) మార్పిడి వాస్తవం శ్రమ సామాజిక విభజన ఒక నిర్దిష్ట అభివృద్ధిని, ఆవిధంగా సామాజిక ఉత్పత్తి ఒక నిర్దిష్ట అభివృద్ధిని సూచిస్తుంది. (ii)మార్పిడి నిర్దిష్ట లక్షణాలు, ఉత్పత్తి నిర్దిష్ట లక్షణాలను సూచిస్తాయి(iii). మార్పిడి తీవ్రతా- పరిధి, ఉత్పత్తి నిర్మాణం ద్వారా అవే నిర్ణయిస్తాయి. ఉదాహరణకు అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ విధానం బాగా అభివృద్ధి చెందిన, ప్రపంచ మార్పిడి స్వరూపానికి భిన్నంగా, ఒక స్వయం సమృద్ధ గ్రామంలోని పరిమిత, స్థానిక మారకం.
ఉత్పత్తి, వినియోగం, పంపిణీ, మారకాల మధ్య సంబంధాలను పరిశీలించిన తరువాత, ఇవన్నీ మొత్తం మీద సజీవంగా, దేనిలోనైతే ఉత్పత్తి ప్రముఖ పాత్ర పోషిస్తుందో ఆ ‘మొత్తం ఉత్పత్తి విధానం’లా దానిని చూడడం సులభం. ఉత్పత్తి, వినియోగం, పంపిణీ, మారకాలు స్వత్రంత్ర విషయాలు కాదన్నది ముఖ్యంగా చూడవలసినది. మార్క్స్ దీనిని ఇలా సమీక్షించాడు: ‘ఆవిధంగా ఒక నిర్దిష్ట ఉత్పత్తి, ఒక నిర్దిష్ట వినిమయాన్ని, పంపిణీని, మారకాన్ని అలాగే ఈ విభిన్న కదలికల మధ్య ఉన్న సంబంధాలను నిర్ణయిస్తుంది.’
సాధ్యమయ్యే అపార్ధాన్ని నివారించడానికి ఉత్పత్తిని సంకుచిత, ఏకపక్ష పద్దతిలో అర్ధం చేసుకోకూడదు. ఉదాహరణకు మార్క్స్ గుర్తించాడు. ఒక మార్కెట్ల విస్తరణ, లేదా మారకం పరధిలో ఒక మార్పు, మరింత లోతుగా వివిధ ఉత్పత్తి విభాగాలలోని శ్రమ విభజనను అభివృద్ధి చేస్తుంది. అదేవిధంగా, ఆ పదం సంకుచిత అర్ధంలో, సంపద పంపిణీ లోని మార్పు ఉత్పత్తిని ప్రభావితం చేస్తింది.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధ శాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది ఐదవ భాగం, నాలుగవ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
