ప్రపంచ ప్రఖ్యాత వైద్య పరిశోధన పత్రిక లాన్సెట్ అధ్యయనం ప్రకారం భారతదేశంలో మధుమేహం వ్యాధితో బాధపడుతున్న వారిలో కేవలం 27.8 శాతం మంది మహిళలు, 29.3 శాతం పురుషులకు మాత్రమే చికిత్స అందుబాటులో ఉంది.
1980తో పోలిస్తే 2022లో భారత్ లో పురుషులు, మహిళల్లో డయాబెటిస్ రేటు 10-12 శాతం పెరిగిందని లాన్సెట్ తాజా అధ్యయనంలో వెల్లడైంది.
ప్రస్తుతం భారతదేశంలో 21.4 శాతం మంది పురుషులు, 23,7 శాతం మంది మహిళలు మధుమేహంతో బాధపడుతున్నారు.
భారతదేశం ప్రస్తుతం ప్రపంచ డయాబెటిస్ రాజధానిగా ఉంది. తాజా అధ్యయనం ప్రకారం భారత్ లో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య 21.2 కోట్లు. ఇది ప్రపంచంలోని మొత్తం డయాబెటిస్ కేసులలో 26% గా ఉంది ఇది ఏ దేశానికైనా అత్యధిక నిష్పత్తి
కానీ, ఇక్కడ మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే దేశంలో ఎక్కువ మంది డయాబెటిస్ రోగులకు ఎటువంటి చికిత్స అందడమే లేదు.
ఈ అధ్యయనం ప్రకారం, ఈ వ్యాధితో బాధపడుతున్న మొత్తం మహిళల్లో 27.8% మందికి మాత్రమే చికిత్స లభిస్తోంది. అదేవిధంగా, 29.3% మంది పురుషులు నూత్రమే చికిత్స పొందుతున్నారు. భారతదేశంలో ఇప్పుడు డయాబెటిస్ కోసం ప్రత్యేక చికిత్స, నివారణ ప్రణాళికను కలిగి ఉన్నప్పటికీ, గత 44 సంవత్సరాలలో చికిత్స కవరేజీ స్వల్పంగా మెరుగుపడింది. 1980లో ఇది 21.6% గా ఉంటే ఇప్పుడు కేవలం 25.3%కు మాత్రమే చేరింది.
ప్రపంచంలోని చికిత్సకు నోచుకోని డయాబెటిస్ కేసులలో భారతదేశంలోనే 30% ఉన్నాయి. ఇది అత్యధికం. అంటే 13.3 కోట్ల మందికి ఎలాంటి చికిత్స అందడం లేదు. చైనాలో 78 మిలియన్ల చికిత్సకు నోచుకోని కేసులు ఉన్నాయి. అంటే అత్యధికంగా చికిత్స కు నోచుకోని వ్యాధిగ్రస్తుల దేశాల్లో చైనాది రెండవ స్థానం. అత్యధిక కేసులు నమోదవుతున్న భారత్ కి, రెండో స్థానంలో ఉన్న చైనాకి మధ్య కూడా భారీ వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసం 50 శాతానికి పైగా ఉంది.
పాకిస్తాన్ లో 24 మిలియన్లు, ఇండోనేషియాలో 18 మిలియన్ల డయాబెటిస్ కేసులు ఉన్నాయి. ఇవి ఎటువంటి చికిత్సకూ నోచుకోని స్థితిలో ఉన్నాయి.
“చికిత్సలో అందుబాటులో ఉన్న వైధ్య సౌకర్యాలు ప్రధానంగా నిర్ధారణ అయిన రోగుల్లోనే ఉన్నాయని గుర్తించాము. అంటే చికిత్స కవరేజీని పెంచడానికి రోగ నిర్ధారణ చేసే సామర్థ్యం మెరుగు పడటం కీలక అవసరం” అని ఈ అధ్యయనం రచయితలు చెప్పారు.
దక్షిణాసియా దేశాలు మధుమేహాన్ని ముందుగానే నివారించడానికి తగినంత కృషి చేయడం లేదని లాన్సెట్ అంచనా వేసింది. అధ్యయన పత్రంలో “సార్వత్రిక ఆరోగ్య భీమా, ప్రాధమిక సంరక్షణకు మంచి అవకాశం ఉన్న దేశాలలో, డయాబెటిస్ ప్రమాదం ఎక్కువగా ఉ న్నవారిని కూడా ముందుగానే గుర్తించవచ్చు. డయాబెటిస్ రాకుండా నిరోధించడానికి లేదా ఆలస్యం చేయడానికి ఆహారం, జీవనశైలి మార్పులు, మందుల వినియోగంపై సలహా ఇవ్వవచ్చు. డయాబెటిస్ స్క్రీనింగ్ పై పరిమిత శ్రద్ధ లేదా వనరులతో తక్కువ వనరులు కలిగిన ఆరోగ్య వ్యవస్థలలో ఈ విధానం విస్తృతంగా ఉపయోగించవచ్చు.” అని అభిప్రాయ పడ్డారు.
జన్యుపరమైన కారణాలు, పర్యావరణ కారకాలులో తేడాలు కూడా ఇతర దేశాలతో పోలిస్తే ఒక దేశంలో అధిక డయాబెటిస్ జనాభాను కలిగి ఉండటానికి దోహదం చేస్తాయి. కానీ, దక్షిణాసియాలోని దేశాలలో బాల్య దశలో పోషకాహార ఎంపికలు, పిండం అభివృద్ధి కారణంగా బరువు పెరగడానికి కూడా తోడ్పడతాయి.
2022లో ప్రచురితమైన ఒక పత్రం ప్రకారం, ప్రపంచంలో ఊబకాయం ఉన్న పిల్లలలో చైనా తర్వాత భారతదేశం రెండవ స్థానంలో ఉంది.
పళ్ళు, కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొనుగోలు చేయడానికి ప్రజల ఆర్థిక స్థోమత పెంచాలని నివేదిక పేర్కొంది. భారతదేశం వంటి దేశాలకు ఇది చాలా ముఖ్యం ఎందుకంటేగత ‘స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ వరల్డ్’ (SOFI)నివేదికలో సగం కంటే ఎక్కువభారతీయులు (55%) ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేకపోతున్నారని స్పష్టం వస్తోంది.
ఆరోగ్యకరమైన ఆహారాలు, క్రీడావకాశాలని మెరుగుపరచడం పేద కుటుంబాలు, అణగారిన వర్గాలకు చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారాల కోసం నగదు బదిలీలు, సబ్సిడీలు లేదా వోచర్లు వంటి చర్యలు అవసరం” అని రచయితలు ప్పారు.
బరువు పెరగడానికి దారితీసే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను కలిగి ఉన్న ఆహారాలపై దేశాలు అధిక పన్ను విధించాలని నివేదిక సూచిస్తోంది.
స్థూలకాయంతో పాటు, నిర్దిష్ట ఆహారాల వినియోగం డయాబెటిస్ ప్రమాదాన్ని అధికంగా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు యోగర్ట్, కొన్ని ఇతర రకాల పాడి ఉత్పత్తులు, తృణధాన్యాలు, ఆకుకూరలు డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి, అయితే చక్కెర తియ్యటి పానీయాలతో సహా శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఈ డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి” అని అధ్యయనం పేర్కొంది.
బంజోత్ కౌర్
అనువాదం : పి ఏ దేవి