
Reading Time: < 1 minute
పలకరింపులన్నీ నేడు
‘పులుపె’క్కి పోయాయి
మమ’కారాలు’ మాయమై
వెట’కారాలు’ మిగిలాయి
అనుబంధాలు అడుగంటి
‘చేదె’క్కిపోయాయి
వలపు రాగాలన్నీ లయతప్పి
‘వగరు’గా మారాయి
మాటల్లో ‘తీపి’ని తట్టుకోలేక
మధుమేహ దేహాలయ్యాయి
చాలీచాలని జీవితాల్లో
అప్పుల’ఉప్పు’ ఎక్కువైంది
మనిషి జీవితంలో
ప్రతినిత్యం ఈ ‘షడ్రుచులు’
పలకరిస్తూ ఉంటే
కొత్త ఉగాదికి చోటెక్కడుంది
వెన్నెల సత్యం
9440032210
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.