
ఎనభై ఏళ్ల స్వరాజ్యాన్ని..
కులం- అవినీతి- ఆశ్రిత పక్షపాతం
రాచపుండై రోగగ్రస్థం చేస్తున్నాయి
నెహ్రూ కాలపు కృష్ణమీనన్ నుంచి
నేటి కాలపు నేతల దాకా
అవినీతి- లంచం రాజ్యమేలుతున్నాయి
పశుదాణా నుంచి పేదోడి తిండి గింజలుదాకా
దోస్తూ, అన్ని రంగాల్లో అవినీతి అందలమెక్కింది
వ్యవస్థను రక్షించే నాలుగు స్థంబాల్లోనూ
ఆల్ట్రా సిమ్మెంట్లా అవినీతి పునాదుల దాకా పాకింది
పుట్టుకపత్రం నుంచి చావుపత్రం దాకా
కాసు కదపందే “చేతి” కందని వైనం
సుందరయ్య- వావిలాల- లచ్చన్నలు కొలువైన చట్టసభలూ
పైరవీలు, లంచాలు, స్వార్థ రాజకీయాలతో సామాన్యుడికి
ఎంతో దూరంగా జరిగి పోయాయి
బ్యాంకులు ముంచిన వారు విదేశాల్లో సుఖిస్తుంటే
దేశ సంపదను పగటి దొంగలై దోస్తున్న సంపన్న వర్గాలు
సామాన్యుడి ఆకలి, అవసరం, ఆశ, లంచం నాగుకు
పాలు పోస్తూ పెంచుతున్న తరుణంలో యువత
మేల్కోని విషనాగును చంపి తగలెట్టాలి
విద్య ఉపాధి వైద్యం కోసం స్వేచ్ఛ
స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందేందుకు కదలాలి
అవినీతి అంతం మా తొలి పంతం అంటూ కదలాలి
నేటి అవినీతి భారతంలో అశ్వద్ధామల్లా,
జమదజ్ఞుల్లా యువత పోరు అస్త్రాలెత్తాలి
అవినీతి లేని భారతాన్ని నిర్మించాలి.
తంగిరాల చక్రవర్తి, 9393804472.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.