కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ దాదాపు రూ. 50 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది చాలా పెద్ద మొత్తం నగదు, ఇందులో నుంచి అందరికీ ఏదో ఒకటి ఇవ్వడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. అయితే, బడ్జెట్‌ను జిడిపి కన్నా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత బడ్జెట్లో 50 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గతంతో పోల్చితే 7.5% ఎక్కువని చెప్పవచ్చు. బడ్జెట్ కేటాయింపు ప్రకారం ఈ పెరుగుదల 6.5 శాతం మాత్రమే అధికంగా ఉంది. కాగా, ప్రస్తుతం జిడిపిలో 10.1 శాతం పెంపు అన్న చర్చ జరుగుతోంది.
జిడిపిని దృష్టిలో పెట్టుకొని చూస్తే బడ్జెట్ కేటాయింపులు తగ్గుతున్నాయి. ఆశించిన స్థాయిలో ఆర్థికవ్యవస్థకు ఏదైతే ప్రోత్సాహం అందాలో అది అందడం లేదు. అదేవిధంగా, ప్రాథమిక లోటు ఆర్థికవ్యవస్థలో వేగాన్ని తెస్తుంది. కానీ ఈ బడ్జెట్లో ప్రాథమిక లోటు తగ్గిపోవడాన్ని చూస్తున్నాము. గత ఏడాది 1.4 శాతం ఉండేవి. అదే ఇప్పుడు అది 0.8 శాతంగా ఉంది. అంటే, 0.6 శాతం డిమాండ్ తక్కువ అవుతుంది. ప్రస్తుత అంశాలను గమనిస్తే వచ్చే ఏడాది ఆర్థికాభివృద్ధిలో మార్పు ఉండదు. అయితే, ఆర్ధికాభివృద్ధి వికసిత్ భారత్‌కు కీలకమైనదిగా పరిగణించబడుతుంది.
ఎంత పన్ను, ఎంత రాయితీ..
మధ్యతరగతి వర్గానికి పన్నులో రాయితీ ఇచ్చారని, ఇంకా వారు 12 లక్షల ఆదాయంపై ట్యాక్ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రస్తుతం అంటున్నారు. ఇందులో 75 వేల స్టాండర్డ్ డిడక్షన్ కల్పితే, ఆ నగదు 12.75 లక్షల అవుతుంది. అప్పుడే దీని ప్రయోజనాన్ని రెండు నుంచి రెండున్నర కోట్ల మంది మాత్రమే పొందుతారు. పన్ను కట్టెవారు లేదా రిటర్న్ ఫైల్ చేసేవారి సంఖ్య దేశంలో సుమారు 9 కోట్లుగా ఉంది. ఇందులో 5 కోట్ల మంది ముందే రిటర్న్ ఫైల్ చేస్తూ ఉండేవారు. ఐదు లక్షల ఆదాయం నుంచి ఏడు లక్షలు చేసి పన్ను రాయితీ పెంచారు. ఇంకా 75 వేలు ప్రామాణిక తగ్గింపు కూడా చేశారు. అయితే దాదాపు 7.5 లక్షల ఆదాయంపై ట్యాక్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. ఈ సంఖ్య దాదాపు 6 కోట్లుగా ఉంది. ఈ 6 కోట్ల మంది ఆదాయ పన్ను శ్లాబులో ఎటువంటి మార్పు ప్రభావం పడదు. ఎందుకంటే, మొదటి నుంచే ఇవి ఈ శ్లాబు పరిధి బయట ఉండేవి.
దాదాపు ఒకటి నుంచి రెండున్నర కోట్ల మంది చాలా తక్కువ ఆదాయపన్ను కట్టేవారు. అటువంటి వారికి దీనివల్ల పెద్దగా లాభం చేకూరదు. ఈ విధంగా, దాదాపు రెండు కోట్ల మంది గట్టెక్కుతారు. ఎవరికైతే లాభం చేకూరుతుందో అందులో ధనవంతుల సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది. వారి పై ఈ వెసులుబాటు ప్రభావం నామమాత్రం. ఈ కేటాయింపు నేరేటివ్ బిల్డింగ్ కోసం చేయబడిందని ఎక్కువగా అనిపిస్తుంది. మధ్యతరగతిలో ఎవరైతే 10-50 లక్షల వరకు సంపాదిస్తారో వారే ఎక్కువగా కీలక రంగాల్లో పనిచేస్తున్నారు. వారికే దీని ప్రయోజనం దక్కుతుంది. కానీ, దీని ప్రభావం ఆర్థికవ్యవస్థ మీద చూపించదు. అందుకోసమే, మధ్యతరగతికి ఇచ్చిన రాయితీ వల్ల వారికి ఖర్చు పెరుగుతుంది దీంతో పాటు డిమాండ్ కూడా పెరుగుతుంది. దీని వల్ల ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుందనే మాట మాత్రం సరైంది కాదు.
వ్యవసాయం, వైద్యం, గ్రామ అభివృద్ధి, ఉపాధి..
ఎప్పుడైతే స్థూలస్థాయిపై దృష్టి సారిస్తారో ఆర్థికవ్యవస్థలో అప్పుడే డిమాండ్ పెరుగుతుంది. బడ్జెట్ రూపకల్పన, ప్రాథమిక లోటు స్థాయిలో మార్పులు, చేర్పులు చేసే అడుగులు వేయడం ఇందులో భాగంగా ఉంది. దీంతో పాటు శ్రమకు చెందిన రంగాల్లో బడ్జెట్ కేటాయింపులు పెరిగినా కూడా డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి వాటిలో ప్రభుత్వం ప్రతీసారి కోతలు విధిస్తుంది. గత ఏడాది వ్యవసాయర- అనుబంధ కార్యకలాపాల బడ్జెట్ 1.52 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది, దానికి కోత విధించి 1.41 లక్షల కోట్ల రూపాయలను చేశారు. దీనిని పెంచి 1.71 లక్షల కోట్లు చేయబడింది. అది ఖర్చు అవ్వడం కష్టతరంలా అనిపిస్తుంది. ఇలానే అనేక క్షేత్రాలు ఉన్నాయి. అటువంటి చోట ఎక్కువ ఖర్చు చేయబడుతుందని ప్రభుత్వం చెబుతుంది. కానీ అక్కడ కూడా ఖర్చు తక్కువ అవుతుంది. ఉదాహరణకు పంటభీమా పథకం ఉంది, అందులో గత ఏడాదితో పోలిస్తే ఈసారి 15- 20 శాతం తగ్గుదల కనబడుతుంది. ఇది నామమాత్రపు తగ్గుదల మాత్రమే. అయితే, వాస్తవ స్థాయిలో చూసుకున్నట్లైతే ఈ తగ్గుదల చాలా ఎక్కువ అవుతుంది.
ఈ విధంగానే సక్షం అంగన్వాడీ- పోషణ పథకంలో 21, 200 కోట్ల రూపాయల కేటాయింపులు ఉండేవి. అందులో నుంచి 20 వేల కోట్లు ఖర్చు చేశారు. ప్రధానమంత్రి రహదారి పథకంలో 19 వేల కోట్ల కేటాయింపులు ఉండేవి, ఖర్చు 14.5 వేల కోట్ల రూపాయలుగా ఉండేది. ఈ సారి ఇందులో మళ్లీ 19 వేల కోట్ల ఖర్చు చేసే ప్రతిపాదన నడుస్తుంది. 5% ద్రవ్యోల్బణ రేటును పరిగణలోకి తీసుకొని గత ఏడాదితో పోల్చితే ఈ కేటాయింపులు తక్కువగానే అనిపిస్తాయి. జల్ జీవన్ మిషన్‌లో 70 వేల కోట్ల కేటాయింపులు పెట్టారు. కానీ 22 వేల కోట్ల వ్యయం అయ్యింది. ఇప్పుడు అందులో 67 వేల కోట్ల రూపాయల వ్యయం చేయాల్సిన ప్రస్థావన కొనసాగుతుంది. అయితే ఇది తక్కువగా ఉంది.
విద్యలో 1.25 లక్షల కోట్ల రూపాయల కేటాయింపు ఉంది. ఈసారి దాదాపు 1.14 లక్షల కోట్ల రూపాయల వ్యయం అయింది. ఇప్పుడు దీనిని 1.28 లక్షల కోట్ల రూపాయలు చేశారు, ఇది గత ఏడాది కేటాయించిన దానికి సమానంగా ఉంది. గ్రామీణాభివృద్ధి కోసం గత ఏడాది బడ్జెట్లో 2.65 లక్షల కోట్లను కేటాయించారు. కానీ, 1.90 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయి. ఈ సారి ఇందులో 2.66 లక్షల కోట్లు కేటాయించారు, ఇది గత ఏడాదికి సమానంగా ఉంది. ఇక్కడ కూడా పెరుగుదల లేదు. గ్రామీణ ఉపాధి గ్యారెంటి యోజనాలో కేటాయింపులు కూడా దాదాపు గత ఏడాది బడ్జెట్‌కు సమానంగా ఉన్నాయి. వాస్తవిక అర్థంలో చూసుకున్నట్లైతే ఇందులో కూడా 10% తగ్గుదల కనిపిస్తుంది.
కృత్రిమ మేధస్సును ప్రొత్సహించడానికి పరిశోధన- అభివృద్ధిలో బడ్జెట్ కేటాయింపుల మీద చర్చ జరుగుతోంది. దీని మీద కూడా ఖర్చులో చెప్పుకోదగ్గ పెరుగుదల ఎక్కువగా కనబడడం లేదు. మొత్తం మీద చూసుకున్నట్లైతే ప్రభుత్వం ఆర్ధిక కేటాయింపులను ప్రకటిస్తుంది. కానీ ఆ నిధులు ఖర్చు కూడా కావు. ప్రతీసారి ఇదే పునరావృతం అవుతుంటుంది. ప్రభుత్వం నిధులు ప్రకటించింది అంతా బాగానే జరుగుతుందిని సామాన్య జనం అనుకుంటుంటారు. వాస్తవానికి వస్తే మాత్రం మార్పు అనేది ఒక పెద్ద విషయంలా కనబడుతుంది.
అభివృద్ధి రోడ్ మ్యాప్..
2047 సంవత్సరం నాటికి అభివృద్ధి దేశంగా మార్చాలనే ఆశయం మనకు ఉంది. అయితే, దీనికి తగ్గట్టుగా మన వృద్ధి స్థాయి వేగంగా ఉండాలి. ధనిక దేశాల్లో అయితే ప్రతి వ్యక్తి ఆదాయం 14 వేల డాలర్లుగా ఉంది. ప్రస్తుతం మన తలసరి ఆదాయం దాదాపు 2,700 డాలర్లుగా ఉంది. ఒకవేళ ఈ విధంగానే 7- 8% వృద్ధిరేటుతో వెళ్తే మాత్రం, నిర్దేశిత సమయం వరకు ప్రతి వ్యక్తి తలసరి ఆదాయ స్థాయి 9 వేల డాలర్లకు మాత్రమే చేరుకుంటుంది.
అప్పటి వరకు మన జనాభా కూడా 140 కోట్ల నుంచి పెరిగి 160 కోట్లకు చేరుకుంటుంది. ప్రస్తుత అంచనాలలో ఒకవేళ మార్పు లేకుంటే మనం 11% వృద్ధి రేటుతో ముందుకు వెళ్తాం. దీంతో 2047 నాటికి 14 వేల డాలర్ల తలసరి ఆదాయ లక్ష్యాన్ని చేరుకోగలం. ఈ లక్ష్యం చేరుకోవాలంటే అభివృద్ధికి సంబంధించిన రోడ్ మ్యాప్ ఉండాలి. కానీ అది ఎక్కడ కూడా మనకు కనపడడం లేదు.
– అరుణ్ కుమార్
(ప్రముఖ ఆర్థికవేత్త)