
****. ఒకప్పుడు మనం స్నేహితులం !
అనుకోకుండా ప్రేమలో పడ్డాం.,కదా !
మన మధ్య దూరాలెప్పుడు తగ్గిపోయాయో తేలీనే లేదు!
నీ సమక్షంలో..ఆ చంద్రుని ఛాయలో నేను వెన్నెల వర్షంలో తడిసాను!
ప్రేమ నిండిన నీ కౌగిలిలో నేను సముద్ర ఘోష విన్నాను !
ఇంతలో ఒక్కసారిగా సారీ అన్నావు దూరంగా జరుగుతూ !
ఏమైంది ..వ్యాకుల పాటుతో అడిగాను !
నాకు కొన్ని మర్యాదలు ఉన్నాయి అన్నావు.
ఏం మర్యాదలు? ఆందోళనగా అడిగాను.
ఏమో నాకు తెలీదు అంటూ మాట మార్చావు.
కాళ్ల కిందనుంచి జారిపోయే ఇసుసుకలా నువ్వు..
ఎగిరి పడే కెరటంలా నేను అలా ఉండిపోయాము !
నాతో కలిసి నవ్వుతూ నాలుగు అడుగులు వేస్తావని.. అనుకున్నాను !
కానీ నీకు అనుకోకుండా మన కులాలు గుర్తుకు వచ్చేసాయి.
నువ్వు నీ కుల ఉచ్చులో మునిగిపోతూ ఉన్నావు
నేను నువ్వు మునిగే దిశలో.. దుఃఖంతో,కలత పడ్డ మనసుతో చూస్తుండిపోయాను!
ఈ కులమతాల పైన నాకు చెప్పలేనంత ఆగ్రహం వచ్చింది!
అసలు ఈ కులాల్ని ఎప్పుడు చూశామని?
ఈ మతాల్ని ఎప్పుడు ప్రేమించామని చెప్పు?
ఇప్పుడెందుకు మన మధ్య కులం వచ్చింది?
ఈ కులపు నీడలెందుకు పెరుగుతూ పోతున్నాయి ?
నీ కుల మర్యాదలకు కుక్క చావు రానూ!
నీ మతాన్ని గాడిదలు తవ్వి పోయా…!
నేను కాదు..నీ హృదయాన్ని బూడిద స్పర్శించనీ!
చెప్పు..మన మధ్య ఈ కుల మతాల చిచ్చు ఏంటి?
మరాఠీ – శరణ్ కుమార్ లింబాలే.
హిందీ – రీనా త్యాగి.
తెలుగు గీతాంజలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.