
‘ఇండియాస్ ఫస్ట్ డిక్టేటర్ షిప్ :ద ఎమర్జెన్సీ, 1975-77’ పుస్తకంలో సంఘ్ పరివార్ గురించి ఇద్దరి మధ్య సంబంధం ఉందని నిర్ధారణ జరిగింది.
‘‘బీహార్ ఉద్యమం, ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమాలు మౌలికంగా ఒకటే’’ అని 1975 ఎమర్జెన్సీలో జయప్రకాష్ నారాయణ్ ఉద్యమం, హిందూ జాతీయవాద సంస్థల మధ్యకలయిక నిర్ధారిస్తున్నాయి. విశాలంగా వారి ప్రాపంచికదృష్టి కలిసొచ్చాయి : సంఘ్ పరివార్ విస్తరణకు జయప్రకాష్ నారాయణ్ దోహదం చేశారు. పశ్చిమ దేశాల నుంచి కాంగ్రెస్ దిగుమతి చేసుకున్న సెక్యులరిజం, సోషలిజంలను సైద్దాంతికంగా వారు తిరస్కరించారు. మహాత్మా గాంధీ ఆలోచనైన గ్రామీణ జీవితం, కుటీర పరిశ్రమల వంటివి తమ ఆకాంక్షలుగా స్తుతించారు.
జయప్రకాష్ నారాయణ్ సంఘ్ పరివార్ పైన ఆధారపడి వేలాడడం లేదు. ‘‘మీరు కనుక ఉద్యమంలో చేరితో వీళ్లు ( ఆర్ ఎస్ ఎస్) పారిపోతారు.’’ అని 1974లో ఆయన జ్యోతి బసుతో మాట్లాడుతూ అన్నారు. ‘‘పరిష్కారం కోసమే వాళ్లను నా ఉద్యమంలోకి తీసుకున్నాను. అక్కడ మన పార్టీలేదు ఏమీ లేదు. వాళ్లకక్కడ నిర్మాణం లేదు’’ అని కూడా పేర్కొన్నారు. తన ప్రయోజనాలు నెరవేర్చడానికి ఎంత కాలం వీలైతే అంత కాలం వాళ్లని పట్టించుకోవాలనుకున్నారు. కలకత్తాలో జయప్రకాష్ నారాయణ్ ర్యాలీ విజయవంతానికి సీపీఐ(ఎం) ప్రధాన పాత్ర పోషించాలని, తాము బలంగా లేని చోట సంఘ్ పరివార్ పైన ఆధారపడాలని చెప్పిన దానికి జ్యోతి బసు అంగీకరించారు. సీఫీఐ (యం) ఈ క్రీడ దీర్ఘకాలం కొనసాగించేత తెలివితక్కువది కాదు . జయప్రకాష్ నారాయణ్ ఉద్యమంలో 1974 నవంబర్ వచ్చే నాటికి సంఘ్ పరివార్ కీలమైంది. అలాగే మిగతా చోట్ల కూడా తమ పార్టీ స్థిరపడాలనుకుంది.
వామపక్షాలను విస్మరించారు. కానీ, జయప్రకాష్ నారాయణ్ ఉద్యమం, హిందూ జాతీయ వాదమనేది మరొక అంశం. ఇక్కడ సంబంధాలు భౌతికమైనవి. ఆర్ ఎస్ ఎస్ నాయకులతో జయప్రకాష్ నారాయణ్ కున్న సంబంధాలు ఉద్యమానికి ఉపయోగపడ్డాయి. బీహార్ లో కరువు సంభవించినప్పుడు 1967లో వాళ్ళిద్దరూ భుజం భుజం కలిపి పనిచేశారు. ఇలా పనిచేస్తున్న క్రమంలో, 1950లో భూదాన ఉద్యమ సమయంలో ఊగిసలాడిన ఉత్తర్ ప్రదేశ్ జనసంఘ్ నాయకుడు నానాజి దేశ్ ముఖ్ వల్ల వారితో జయప్రకాష్ నారాయణ్ సంబంధాలకు ఆటంకం ఏర్పడింది. అతి పెద్ద సంస్థ తమ దగ్గర ఉన్నా, వారి స్నేహ సంబంధాలు కుంచించుకుపోయాయి.
జయప్రకాష్ నారాయణ్, దేశ్ ముఖ్ కలిసి ఉంటే,సంఘ్ పరివార్ కు జయప్రకాష్ నారాయణ్ ఉద్యమం పట్ల ఎలాంటి అభ్యంతరాలు ఉండేవి కావు. పంతొమ్మిదివందల అరవయ్యవ దశకం మధ్య నుంచి హిందూ జాతీయ వాదులు వ్యూహాత్మకంగా విడిపోయారు. ఒక శిబిరం రాజకీయ అంటరానితనాన్ని ప్రోత్సహిస్తే(గాంధీ హత్య నుంచి చాలా మంది దాని నాయకులు ఆ పదాన్ని వాడడం పట్ల న్యాయబద్ధత కొరవడిందని భావించారు), ఒక హక్కుగా, అభివృద్ధి చెందే ఒక మంచి ఎత్తుగడ అవసరం. ఆర్ ఎస్ ఎస్ ను సంఘటనిస్ట్ ఎత్తుగడగా మార్చడానికి ఇదే సమయమని బల్ రాజ్ మధోక్, ఇతర జనసంఘ్ నాయకులు భావించారు. సమయం వచ్చే వరకు బలమైన రాజకీయాలను ఎదుర్కోవడానికి క్షేత్ర స్థాయి నుంచి బలపడాలి-కింద నుంచి పై వరకు భారతీయీకరణ జరగాలి, వారి పరిభాషలో హిందుత్వీకరించడం. కాంగ్రెస్ (ఓ), స్వతంత్ర, జనసంఘ్ ఐక్యమయ్యే విధంగా ఒకే వేదికపై బహిరంగంగా చెప్పాలి. బాగా ప్రాచుర్యం పొందేలా చేయాలని మరొక శిబిరంలో ప్రతిపాదన. సంఘ్ పరివార్ కీలకమైన సామాజిక సంప్రదాయవాదం స్థానంలో సామ్యవాద ఆలోచనలను ప్రవేశ పెట్టాలని అటల్ బిహారీ వాజ్ పాయ్, లాల్ కృష్ణ అద్వాని, సంఘీయుల బంధువులు భావించారు. జాతీయీకరణను, సంక్షేమాన్నిసమర్థించడం, కార్మికుల సమ్మెలో పాల్గనడం ద్వారా విస్తృత ప్రజాబాహుళ్యంలోకి హిందూ జాతీయ వాదాన్ని తీసుకెళ్ళవచ్చని భావించారు. అన్ని సంప్రదాయ పార్టీలు ఇలా చేయడం ద్వారా 1971-74 మధ్య ఎన్నికల్లో తమ ధ్యేయాన్ని చేరుకోవడం తేలికైంది.
సంఘ్ పరివార్ కు ఆచరణలో ఒక ఎత్తుగడ అవసరమైంది. ఈ సంఘటనలో ఆర్ ఎస్ ఎస్ అగ్ర నాయకులు, మధోక్ ఆలోచనైన అత్యున్నత రాజకీయ నిర్మాణం కంటే, వాజ్ పాయ్ జనాకర్షణకు ప్రాధాన్యతనిచ్చారు. ఏదేమైనప్పటికీ అది ‘సంఘటనిజం’ విధానానికి దగ్గరగా ఉంది. ఏదైతే 1970లో వాజ్ పాయ్ మార్గాన్ని ఆచరణలో అనుసరించారో, ఆ భూపరిమితి చట్టానికి, ‘దారిద్ర్యంపై జాతీయ యుద్ధం’ ప్రకటనకు మద్దతు తెలిపారు. అలాగే ఎత్తుగడగా మధూక్ విధానానికి కూడా చోటు కల్పిస్తూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ (ఓ)తో వ్యూహాత్మక పొత్తు ఏర్పాటు చేసుకున్నారు. ఏదిఏమైనప్పటికీ 1971 ఎత్తుగడ ననుసరించి ఘనమైన ఎన్నికల పొత్తుతో ఇందిరాగాంధీ ఎదుగుదలను ఎదుర్కోవడంలో విఫలమయ్యారు. ‘బాధితుల పట్ల విచారం’ , ‘సామాజిక న్యాయం సమానత్వానికి ఒత్తిడితేవడం’ వంటి నినాదలను వాజ్ పాయ్ ఇచ్చినప్పటికీ, వారు ఇందిరాగాంధీని చాలా తక్కువ అంచనా వేశారు.
బీహార్, గుజరాత్ లలో ఏర్పడిన ఇబ్బందులు వారి మార్గానికి వారిని దూరంగా తీసుకెళ్లాయి. కె.ఎన్. గోవిందాచార్య వంటి హిందూ జాతీయ నాయకులు 1975 తొలి నాళ్ళలో సోషలిస్టులు, సంప్రదాయ వాదుల వంటి వారితో వేదికలను పంచుకున్నారు. బీసీఎస్ ఎస్ స్టీరింగ్ కమిటీలో ఏబీవీపి సభ్యులు చేరారు. ఇందిరా గాంధీ ప్రభుత్వాన్ని దింపేయడానికి ఏర్పడిన దేశ్ ముఖ్ ప్రతిపక్ష పార్టీల కూటమి ‘లోక్ సంఘర్ష్ సమితి’కి గోవిందాచార్య 1975 జూన్ 25న కార్యదర్శిగా ఎంపికయ్యారు. కొద్ది కాలంలోనే వాళ్ళని అంటరాని వాళ్లుగా చూడడం పోయింది. జయప్రకాష్ నారాయణ్ ఉద్యమం ‘‘సమాజ మేలు కోసం ఒక శక్తి’’ అని ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘ్ సంచాలక్ బాలాసాహెబ్ దేవరస్ 1974 డిసెంబర్ లో ప్రకటించారు. ‘‘మీరు ఫ్యాసిస్ట్ అయితే నేను కూడా ఫ్యా సిస్టునే అవుతా’’ అని ఆర్ ఎస్ ఎస్ జన సమూహాన్ని ఉద్దేశించి జయప్రకాష్ నారాయాణ్ 1975 మార్చిలో ప్రకటించారు. ఆయన హాస్యం అర్ధసత్యం. సంఘ్ పరివార్ కొత్తగా ఆమోదించడంలో ఇమిడి ఉన్న చాలా విలువైన రాజీ ఏమిటి? ఎలా వివరించినా తోడుగా వచ్చేదేమీ లేదు. ఆర్ ఎస్ ఎస్ వార పత్రిక ‘ఆర్గనైజర్’ సంపాదకీయాల్లో కుట్రపూరిత సిద్ధాంతాలు నడుపుతోంది. ఉదాహరణకు 1975 జనవరిలో అది సూచించిందేమిటంటే, 1948లో అధికారాన్ని ఏకీకృతం చేయడంలో నెహ్రూకు మహాత్మా గాంధీ ‘‘అనుమానాస్పదంగా తోడ్పడ్డారు’’. దాంతా పాటు 1968లో జరిగిన సంఘ్ అధ్యక్షులు దీనదయాల్ ఉపాధ్యాయను ‘దారుణ హత్య’ చేయించింది ఇందిరాగాంధీనేనని ఆరోపణ చేశారు.
జయప్రకాష్ ఉద్యమం బహుశా వెనుక చూపుతోనే సంఘ్ పరివార్ కు శాశ్వత గెలుపును ప్రసాదించింది. ప్రతిఫలంగా గుజరాత్, బీహార్ కు పరిమితం కాకుండా జయప్రకాష్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సాయం చేసింది. అది 1974 నాటికి దేశవ్యాప్తమైంది.
హిందూ జాతీయ వాదం ప్రబలతో వెలిగిపోతున్న కొన్ని దశాబ్దాల వెనక్కి వెళితే, ఎమర్జెన్సీ కాలంలో హిందూ జాతీయవాదానికి ఒక గుర్తింపు లభించడం ఒక ముఖ్యమైన పరిణామం. దీని కోసం అప్పటికే జయప్రకాష్ నారాయణ్ ఉద్యమం చొరవ తీసుకుంది. దీంతో నియంతృత్వానికి అతి తీవ్రమైన పరీక్షగా మారి, రాజకీయంగా అది ప్రత్యామ్నాయంగా తయారైంది. జనసంఘ్ ద్వారా సంఘపరివార్ (ఆర్ ఎస్ ఎస్ కుటుంబం) లోక్ సంఘర్షణ్ సమితి(ఎల్ ఎస్ ఎస్) లో రంగురంగులతో కూడిన ఒక శక్తిగా ఏర్పడింది. ఆర్ ఎస్ ఎస్ పెద్ద ఎత్తున ప్రోత్సాహించడం వల్ల ఇరవై ఒక్క నెలల నియంతృత్వ కాలంలో అధికారాన్ని అందుకోవాలనే స్థాయికి వచ్చింది. ‘‘లోక్ సంఘర్షణ్ సమితి క్షేత్ర స్థాయి నిర్మాణంలో చాలా మంది ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు చేరారు. దీంతో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు రాజకీయ నాయకులతో పనిచేసి, రాజకీయానుభవం పొందడానికి ఒక మంచి అవకాశం ఏర్పడింది.’’ అని అండర్ సన్, డాంపుల్ అంటారు. గడిచిన గణతంత్రం నాటి కాలంలో రాజకీయంగా వీరు ‘అంటరాని వారిగా ఉన్నారు’ అని వారిలో కొందరు నాయకులు చమత్కరించిన మాటను కాదనలేం. ఈ నేపథ్యంలో ఈ చర్యలు వీరికి విశ్వశనీయతను కల్పించాయి. సంఘ్ పరివార్ ఎమర్జెన్సీని వ్యతిరేకించిన విషయం మనం చూశాం. జైలుకు వెళ్లే క్రమంలో కొందరుస్నేహితులను సంపాదించారు. క్షమాపణల కోసం ఢిల్లీ పాలకులతో సంప్రదింపులు కూడా జరిపారు.
ఎమర్జెన్సీ ప్రకటించడానికి ఒక రోజు ముందు, అంటే 1975 జూన్ 26న ముఖ్యమైన సంఘ్ పరివార్ నాయకులు ఢిల్లీలోని కశ్మీరి గేట్ వద్ద రహస్యంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో ఢిల్లీ జనసంఘ్ ముఖ్యులు, కాంగ్రెస్ (ఓ) సభ్యులు ఉన్నారు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాలతోపాటు, ఢిల్లీ బయట కూడా సత్యాగ్రహంతో ఎలా నిరసన తెలపాలన్నది నిర్ణయమైంది. ఈ ఆందోళన రూపం వలసవాద వ్యతిరేక పోరాటం నుంచి స్ఫూర్తి పొందింది. నిరసనలు చెల్లాచెదురుగా పెరిగిపోయి, జాతీయతా స్పృహను విస్తరింపచేసింది. తాత్కాలికంగా అణచివేసినప్పటికీ, పాలకులు ఇతరుల తాత్కిలిక ఒప్పందాలను తిరస్కరించారు. అంతర్గత యుద్ధం ఎలా చేయాబోతున్నామని ఎత్తుగడల్లో ముందుగా రాసుకున్న విధంగా ఎమర్జెన్సీ కాలంలో అజ్ఞాతంగా పేపర్లను ఉఫయోగించడం, సెన్సార్ షిప్ పుకార్లు, అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడం, జాతీయత, ప్రజాస్వామ్యం, చట్టబద్ద పాలనకోసం అప్పీల్ చేసుకోవడం వంటివి సత్యాగ్రహమే చూపింది;.
బాగా పాతుకుపోయిన హిందూ జాతీయవాద ఆందోళనలు నిరసనల్లో ప్రతిఫలించాయి. సందిగ్దమైన వలసవాదపాలనకు అనుకరణగా ఉన్న నెహ్రూపాలనా కాలం చాలా కాలంగా వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ పోరాటాన్ని తమదైన రెండవ స్వాతంత్ర్య సమరంలా భావించారు. తొలి స్వతంత్ర్యపోరాటంలో గాంధేయవాద సాంకేతికతను అనుసరిస్తూ, ఆర్ ఎస్ ఎస్ గతంలో పెంచిపోషించిన ప్రతిష్టాత్మకమైన జాతీయవాదాన్ని మినహాయాంచారు. ఉప్పు పండించే వారిపై పన్ను విధించిన చట్టానికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ 1930 మార్చిలో అహ్మదాబాద్-దండి మధ్య 240 మైళ్లు పాదయాత్ర చేపట్టిన దండి ఉప్పు సత్యాగ్రహాన్ని పోలిన విధంగా ఉద్యమం చేపట్టాలనుకున్నారు. గతంలో కనివినీ ఎరుగని విధంగా స్థానిక ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి బాబూబాయ్ పటేల్ స్వాతంత్ర్యదినోత్సవం నాడు గాంధీజీని అనుకరించాడు. ఏదిఏమైనప్పటికి ఈ సంఘటన జరగడానికి ఆరు రోజుల ముందు 1976 ఆగస్టు 9 తన పరివారజనం వెళ్ళాల్సిన దారిలో పటేల్ తోపాటు డజను మంది సత్యాగ్రహులను అరెస్టు చేశారు.
సత్యాగ్రహానికి కొన్ని వారాల ముందు వరకు ఆర్ ఎస్ ఎస్ ఒక బలీయమైన శక్తి అని స్పష్టమైంది. ఆర్ ఎస్ ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రకారం 1975లో శాఖకు 50 నుంచి వంద మంది గల 8,500 శాఖలున్నాయి. కాబట్టి ఆర్ ఎస్ ఎస్ మొత్తం బలం 4, 25,000 నుంచి 8,50,000. వీళ్లు కాకుండా మిగతా సంఘ్ పరివార్ లో కార్మికుల యూనియన్ బీఎంఎస్ లో 1977నాటికి పది లక్షల 20 వేలమంది; విద్యార్థి విభాగం ఏబీవీపి లో 1,70,000 మంది ఉన్నారు. ఇంకా ఇతర అనుబంధ సంఘాలు కూడా ఉన్నాయి. సంఘపరివార్ సభ్యుల సంఖ్యను లెక్కేస్తే, రెండు నుంచి మూడు మిలియన్ల మంది ఉన్నారు.
(జఫర్ లాట్, ప్రతిన్ వా అనిల్ రాసిన ‘ఇండియాస్ ఫస్ట్ డిక్టేటర్ షిప్: ద ఎమర్జెన్సీ 1975-77’ ప్రచురణ :హార్పర్ కొలిన్స్. నుంచి వారి అనుమతితో.)
ప్రతిన్ వా అనిల్ క్లారిన్ డన్ స్కాలర్. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలోని సెంట్ జాన్స్ కాలేజీలో ‘వలసపాలనానంతర భారత దేశంలో ముస్లిం రాజకీయాలు’ అన్న అంశంపై పరిశోధన చేస్తున్నారు.
రచన: క్రిస్టొఫిజఫర్ లాట్, ప్రతినవ్ అనిల్
అనువాదం: రాఘవ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.